ప్రపంచ చెస్ చాంపియన్ కు మూడు నెలల్లోనే రెండోసారి షాకిచ్చిన భారత యువ గ్రాండ్ మాస్టర్

21-05-2022 Sat 14:23
  • చెస్సబుల్ మాస్టర్స్ ఆన్ లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నీ
  • ఐదో రౌండ్ లో కార్ల్ సన్ తో ప్రజ్ఞానంద పోటీ
  • డ్రా అవుతుందనుకున్న మ్యాచ్ లో గెలుపు
  • 40వ మూవ్ లో తప్పటడుగు వేసి దొరికిపోయిన ప్రపంచ చాంపియన్
Indian Grand Master Praggnananda Shocks Carlsen Yet Again
ప్రపంచ చెస్ చాంపియన్ మాగ్నస్ కార్ల్ సన్ కు భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద మరోసారి షాకిచ్చాడు. చెస్సబుల్ మాస్టర్స్ ఆన్ లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ లో కార్ల్ సన్ ను ఓడించాడు. మూడు నెలల వ్యవధిలో ప్రపంచ చాంపియన్ పై గెలిచి సంచలనమే సృష్టించాడు. నిన్న జరిగిన ఐదో రౌండ్ లో పోటీ పడిన ఇద్దరూ.. హోరాహోరీగా ఆడారు. మ్యాచ్ డ్రా అవుతుందనగా.. కార్ల్ సన్ తన 40వ మూవ్ లో తప్పటడుగు వేశాడు. 

అక్కడే కార్ల్ సన్ ఖతమైపోయాడు. చాంపియన్ కు యువ మాస్టర్ చెక్ మేట్ పెట్టేశాడు. ఈ విజయంతో 12 పాయింట్లు సాధించిన ప్రజ్ఞానంద నాకౌట్ దశకు చేరేందుకు దగ్గరయ్యాడు. ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్నాడు. మరోవైపు 15 పాయింట్లతో కార్ల్ సన్ మూడో స్థానంలో ఉన్నాడు. అంతకుముందు ఫిబ్రవరిలో జరిగిన ఎయిర్ థింగ్స్ మాస్టర్స్ ఆన్ లైన్ ర్యాపిడ్ టోర్నీలోనూ కార్ల్ సన్ ను ప్రజ్ఞానంద ఓడించాడు.