'అంటే .. సుందరానికీ' నుంచి మరో లిరికల్ సాంగ్ రెడీ!

21-05-2022 Sat 12:29
  • వివేక్ ఆత్రేయ నుంచి వస్తున్న మరో కామెడీ ఎంటర్టైనర్ 
  •  బ్రాహ్మణ యువకుడైన సుందరం పాత్రలో నాని
  •  క్రిస్టియన్ యువతి పాత్రలో నజ్రియా
  • జూన్ 10వ తేదీన సినిమా విడుదల
Ante Sundaraniki movie update
నాని హీరోగా 'అంటే .. సుందరానికీ' సినిమా రూపొందింది. విలేజ్ వాతావరణంలో పెరిగిన ఒక బ్రాహ్మణ యువకుడికీ .. ఫారిన్ లో పెరిగిన ఒక క్రిస్టియన్ అమ్మాయికి మధ్య నడిచే ప్రేమకథనే ఈ సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చాడు. 

నాని సరసన నాయికగా మలయాళ హీరోయిన్ నజ్రియా తెలుగు తెరకి పరిచయమవుతోంది. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన అప్ డేట్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు మరో లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ నెల 23వ తేదీన ఈ సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్టు చెబుతూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. 

ఈ సినిమాలో నాని డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. నదియా .. రోహిణి .. నరేశ్ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. జూన్ 10వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఇక నాని మరో చిత్రంగా 'దసరా' సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్ అలరించనుంది.