పవన్ పాత్రపై క్లారిటీ ఇచ్చిన హరీశ్ శంకర్!

21-05-2022 Sat 10:29
  • ' గబ్బర్ సింగ్' కాంబినేషన్లో మరో సినిమా
  • 'భవదీయుడు  భగత్ సింగ్' గా టైటిల్ ఫిక్స్ 
  • ప్రొఫెసర్ పాత్రలో కనిపించనున్న పవన్
  • కథానాయికగా కనిపించనున్న పూజ హెగ్డే
  • త్వరలోనే మొదలు కానున్న షూటింగు
Pavan and Harish combo movie update
పవన్ కల్యాణ్ ప్రస్తుతం 'హరి హర వీరమల్లు' సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ  సినిమాను ఎ.ఎమ్.రత్నం నిర్మిస్తున్నారు. చారిత్రక నేపథ్యంలో నడిచే ఈ కథలో పవన్ సరసన నాయికగా నిధి అగర్వాల్ అందాల సందడి చేయనుంది. కీరవాణి ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

ఈ సినిమా తరువాత హరీశ్ శంకర్  దర్శకత్వంలో పవన్ 'భవదీయుడు భగత్ సింగ్' సినిమా చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో పవన్ ఎలా కనిపించనున్నారు? ఆయనను ఎలా చూపించనున్నారు? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో ఆయన ప్రొఫెసర్ గా కనిపించనున్నారని హరీశ్ శంకర్ చెప్పాడు. 

పవన్ ఈ సినిమాలో ప్రొఫెసర్ గా కనిపించనున్నాడనే టాక్ ఇంతకుముందే వచ్చింది. ఇప్పుడు ఆ విషయంలో హరీశ్ శంకర్ క్లారిటీ ఇచ్చాడన్న మాట. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించే ఈ సినిమాలో పవన్ సరసన నాయికగా పూజ హెగ్డే అలరించనుంది. ఈ జోడీని తెరపై చూడటం కోసం .. ' గబ్బర్ సింగ్' కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తితో ఉన్నారు.