శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేసిన టీటీడీ

21-05-2022 Sat 10:11
  • జులై, ఆగస్ట్ నెలలకు ప్రత్యేక దర్శనం టికెట్ల విడుదల
  • రోజుకు 25 వేల టికెట్ల చొప్పున కేటాయించిన టీటీడీ
  • జులై 15 వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దు
TTD releases online special darshan tickets for July and August months
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకోవాలనుకుంటున్న భక్తులకు శుభవార్త. జులై, ఆగస్ట్ నెలలకు సంబంధించి రూ. 300 విలువైన ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేసింది. టీటీడీ ఆన్ లైన్ పోర్టల్ నుంచి టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ తెలిపింది. రోజుకు 25 వేల టికెట్ల చొప్పున టీటీడీ ఆన్ లైన్లో ఉంచింది. 

మరోవైపు టీటీడీ మరో కీలక ప్రకటన చేసింది. వేసవి సెలవుల్లో శ్రీవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో జులై 15వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్టు టీటీడీ ప్రటించింది. వీఐపీ బ్రేక్ దర్శనాలను కేవలం ప్రొటోకాల్ ఉన్న ప్రముఖులకు మాత్రమే పరిమితం చేసినట్టు తెలిపింది. 

tirupatibalaji.ap.gov.in లింక్ ద్వారా టీటీడీ వెబ్ సైట్లో లాగిన్ అయి టికెట్లను బుక్ చేసుకోవచ్చు.