ప్రపంచ నంబర్ వన్ యమగూచిని చిత్తు చేసిన పీవీ సింధు

21-05-2022 Sat 09:43
  • థాయ్ లాండ్ ఓపెన్ లో సత్తా చాటుతున్న సింధు
  • క్వార్టర్స్ లో జపాన్ కు చెందిన యమగూచిపై విజయం
  • సెమీస్ లో చైనాకు చెందిన చెన్ యూఫీని ఢీకొననున్న సింధు
PV Sindhu enters semi finals in Thailand Open
తెలుగు తేజం, భారత టాప్ షట్లర్ పీవీ సింధు మరోసారి సత్తా చాటింది. థాయ్ లాండ్ ఓపెన్ లో ప్రపంచ నెంబవర్ వన్ అకానె యమగూచి (జపాన్)ని చిత్తు చేస్తూ సెమీ ఫైనల్స్ కు దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో యమగూచిని 21-15, 20-22, 21-13 తేడాతో మట్టికరిపించింది. తొలి గేమ్ ను సింధు కైవసం చేసుకోగా, రెండో గేమ్ లో యమగూచి జోరును ప్రదర్శించి గెలిచింది. ఫలితాన్ని నిర్ణయించే మూడే గేమ్ లో యమగూచి వెన్నునొప్పితో ఇబ్బంది పడింది. ఇదే అదనుగా స్మాష్ షాట్లతో విరుచుకుపడిన సింధు మూడో గేమ్ ను సొంతం చేసుకుని సెమీస్ కు చేరింది. సెమీస్ లో చైనాకు చెందిన ఒలింపిక్స్ ఛాంపియన్ చెన్ యూ ఫీని సింధు డీకొంటుంది.