Air India: గాల్లో ఉండగానే పనిచేయడం మానేసిన ఇంజిన్.. ముంబైలో ఎయిరిండియా విమానం అత్యవసర ల్యాండింగ్

  • ముంబై నుంచి బెంగళూరు బయలుదేరిన విమానం
  • విమానంలోని రెండు ఇంజిన్లలో ఒకటి ఆగిపోయిన వైనం
  • తిరిగి ముంబైకి తరలించి సేఫ్ ల్యాండింగ్
  • మరో విమానంలో ప్రయాణికులను బెంగళూరు తరలించిన ఎయిర్  ఇండియా
  • విచారణ ప్రారంభించిన డీజీసీఏ 
Air India Made Emergency Landing After Airbus Engine Shut Mid Air

ముంబై నుంచి బెంగళూరు బయలుదేరిన ఎయిరిండియా విమానం పెను ప్రమాదం నుంచి బయటపడింది. గగనతలంలో ఉండగానే విమానంలోని ఒక ఇంజిన్ ఆగిపోవడంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి ముంబై విమానాశ్రయంలో సేఫ్ ల్యాండింగ్ చేశాడు. ఈ ఘటనపై డీజీసీఏ విచారణ ప్రారంభించింది. ఎయిర్ ఇండియాకు చెందిన ఏ320 నియో విమానం ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గురువారం ఉదయం 9.43గంటలకు బెంగళూరు బయలుదేరింది. 

రెండు సీఎఫ్ఎం ఇంజిన్లు కలిగిన ఈ విమానంలో ఒకటి గగనతలంలో ఉండగానే మొరాయించింది. ఇంజిన్ పనిచేయడం ఆగిపోవడాన్ని గుర్తించిన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యాడు. విమానాన్ని ముంబై మళ్లించి 10.10 గంటలకు ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. ప్రయాణికులను మరో విమానంలో బెంగళూరుకు తరలించారు.

More Telugu News