పిక్ ఆఫ్ ద డే!.. ఈ ఫొటోలో ఉన్న‌ది ఎవరు?

20-05-2022 Fri 21:07
  • లండ‌న్ ప‌ర్య‌ట‌న‌లో రాహుల్ గాంధీ
  • ఐడియాస్ ఫ‌ర్ ఇండియా స‌ద‌స్సుకు హాజ‌రు
  • స‌ద‌స్సులో రాజీవ్ గాంధీ లుక్కులో క‌నిపించిన రాహుల్‌
rahul gandhi looks like his father rajiv gandhi in london tour
పై ఫొటోలో కాలు మీద కాలేసుకుని కూర్చున్న నేత‌ను గుర్తు ప‌ట్టారా?  భార‌త మాజీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీలా క‌నిపిస్తున్నారు క‌దా? ఈ ఫొటోను చూస్తే టక్కున గుర్తుకు వ‌చ్చేది రాజీవ్ గాంధీనే. అయితే ఫొటోలో ఉన్న‌ది మాత్రం రాజీవ్ గాంధీ కాదు. ఆయన కుమారుడు రాహుల్ గాంధీ. ఇంతకుముందు కొంతకాలం కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడిగా ప‌నిచేసిన రాహుల్‌... ఇప్పుడు పార్టీ ఎంపీగా కొన‌సాగుతున్నారు. అయినా కూడా పార్టీ సార‌థ్య బాధ్య‌త‌ల‌ను భుజాన వేసుకున్న‌ట్లుగానే సాగుతున్నారు. 

ఈ క్ర‌మంలో శుక్ర‌వారం లండ‌న్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన రాహుల్ గాంధీ... అక్క‌డ ఐడియాస్ ఫ‌ర్ ఇండియా పేరిట నిర్వ‌హించిన స‌ద‌స్సులో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా స‌ద‌స్సు నిర్వాహ‌కుడితో మాట్లాడుతున్న సంద‌ర్భంగా కుర్చీలో కాలుపై కాలేసుకుని మాట్లాడుతున్న రాహుల్ ఫొటోను తీసిన మీడియా ప్ర‌తినిధులు దానిని సోష‌ల్ మీడియాలో పెట్టేశారు. ఈ ఫొటోను చూసిన చాలా మంది నెటిజ‌న్లు.. ఈ ఫొటో రాజీవ్ గాంధీని గుర్తు చేసిందంటూ కామెంట్లు పెడుతున్నారు. అచ్చు గుద్దిన‌ట్లు రాజీవ్ గాంధీ మాదిరే క‌నిపిస్తున్న రాహుల్ గాంధీకి చెందిన ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిపోయింది.