ప్ర‌త్యేక విమానంలో కేసీఆర్ ప‌క్క సీటు!... ఆనంద డోలిక‌ల్లో టీఆర్ఎస్ ఎంపీ!

20-05-2022 Fri 20:48
  • ఢిల్లీకి ప్ర‌త్యేక విమానంలో బ‌య‌లుదేరిన కేసీఆర్‌
  • కేసీఆర్ ప‌క్క సీటులో కూర్చుని ఢిల్లీకి చేరిన రంజిత్ రెడ్డి
  • కేసీఆర్ ప‌క్క సీటు ల‌భించ‌డం ఓ గౌర‌వంగా భావిస్తున్నానన్న ఎంపీ
Chevella mp ranjith reddy sits along side seat to cm kcr
దేశవ్యాప్త ప‌ర్య‌ట‌న నిమిత్తం టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్ర‌వారం సాయంత్రం ఢిల్లీ బ‌య‌లుదేరి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. కేసీఆర్ వెంట టీఆర్ఎస్‌కు చెందిన కీల‌క నేత‌లు కూడా ఢిల్లీ బ‌య‌లుదేరారు. వీరిలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా ఉన్నారు. సీఎం కేసీఆర్ ఎక్కిన ప్ర‌త్యేక విమానంలో ఆయ‌న సీటులోనే కూర్చున్న రంజిత్ రెడ్డి... అలా కేసీఆర్ ప‌క్క సీటు ల‌భించడం పట్ల ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 

ప్ర‌త్యేక విమానంలో కేసీఆర్ ప‌క్క సీటులో ప్ర‌యాణించ‌డం గౌర‌వంగా భావిస్తున్నాన‌ని ఈ సంద‌ర్భంగా రంజిత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ ప‌క్క‌న కూర్చుంటే ఉత్సాహంగా ఉంటుంద‌ని, ఆయా అంశాల‌పై కేసీఆర్ చేసే లోతైన విశ్లేష‌ణ ఉత్తేజంగా ఉంటుంద‌ని పేర్కొన్నారు. కేసీఆర్ ప‌క్క సీటులో కూర్చున్న త‌న ఫొటోను కూడా రంజిత్ రెడ్డి పోస్ట్ చేశారు.