2023 ఐపీఎల్‌లోనూ ఆడ‌తా!.. కెప్టెన్ కూల్ ధోనీ ప్ర‌క‌ట‌న‌!

20-05-2022 Fri 20:35
  • నేటి మ్యాచే ఈ ఐపీఎల్‌లో ధోనీకి చివ‌రి మ్యాచ్‌
  • ఇప్ప‌టికే ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్ర‌మించిన చెన్నైకి ఇదే ఆఖ‌రు మ్యాచ్‌
  • 2024 సీజ‌న్‌లో ఆడ‌తానో, లేదో తెలియ‌ద‌న్న ధోనీ
ms dhoni declares that hewill play in 2023 ipl season
క్రికెట్ ల‌వ‌ర్స్‌కు కెప్టెన్ కూల్ మ‌హేంద్ర సింగ్ ధోనీ ఓ గుడ్ న్యూస్ చెప్పాడు. నేడు రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఆడుతున్న మ్యాచే ఈ ఐపీఎల్‌లో ధోనీకి చివ‌రి మ్యాచ్ కానుంది. పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో కింది నుంచి రెండో స్ధానంలో నిలిచిన చెన్నై జ‌ట్టు... ప్లే ఆఫ్స్ నుంచి త‌ప్పుకోక త‌ప్ప‌లేదు. ఫ‌లితంగా చెన్నై జ‌ట్టు ఈ ఐపీఎల్‌లో శుక్ర‌వారం త‌న చివ‌రి మ్యాచ్‌ను ఆడుతుంది. ఈ సంద‌ర్భంగానే ధోనీ ఓ గుడ్ న్యూస్ చెప్పాడు.

2023 ఐపీఎల్ సీజ‌న్‌లోనూ తాను ఆడ‌నున్న‌ట్లు ధోనీ ప్ర‌క‌టించాడు. వ‌చ్చే ఐపీఎల్ సీజ‌న్‌లోనూ తాను ఆడ‌తాన‌ని చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు కెప్టెన్‌గా కొన‌సాగుతున్న ధోనీ తెలిపాడు. 2023 ఐపీఎల్ సీజ‌నే త‌న‌కు చివ‌రి సీజ‌నా? అన్న‌ది ఇప్పుడే చెప్ప‌లేన‌ని కూడా ధోనీ పేర్కొన్నాడు. 2024 ఐపీఎల్ సీజ‌న్‌లో కూడా కొనసాగుతారా? అన్న ప్ర‌శ్న‌కు పై విధంగా ధోనీ సమాధానమిచ్చాడు. 2024 సీజ‌న్ సంగ‌తేమో గానీ... 2023 సీజ‌న్‌కు అయితే ధోనీ ఆడ‌తాడు క‌దా అంటూ అత‌డి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.