Sheena Bora murder case: ఆరున్న‌రేళ్ల త‌ర్వాత జైలు నుంచి విడుద‌లైన ఇంద్రాణి ముఖ‌ర్జియా

Sheena Bora murder case accused Indrani Mukherjea walks out of Byculla Jail
  • షీనా బోరా హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితురాలు ఇంద్రాణి
  • ఆరున్న‌రేళ్లుగా ముంబై బైకుల్లా జైలులో ఉంటున్న ముఖ‌ర్జియా
  • గురువారం బెయిల్ మంజూరు చేసిన సీబీఐ ప్ర‌త్యేక కోర్టు
కూతురు హ‌త్య కేసులో నిందితురాలిగా ఆరున్న‌రేళ్లుగా జైలు జీవితం గ‌డుపుతున్న ఇంద్రాణి ముఖ‌ర్జియా శుక్ర‌వారం సాయంత్రం ఎట్ట‌కేల‌కు బ‌యట‌కు వ‌చ్చారు. దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేకెత్తించిన షీనా బోరా హ‌త్య కేసులో ఆమె త‌ల్లి ఇంద్రాణి ముఖ‌ర్జియానే ప్ర‌ధాన నిందితురాలంటూ పోలీసులు కేసులు న‌మోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులు త‌మ త‌ప్పు ఒప్పుకోగా... ఇంద్రాణి మాత్రం ఇప్ప‌టికీ నేరాన్ని అంగీక‌రించ‌లేదు. ఈ క్ర‌మంలోనే ఆమె ఆరున్న‌రేళ్ల‌కు పైగా ముంబైలోని బైకుల్లా జైలులోనే ఉంటున్నారు. 

తాజాగా త‌న‌కు బెయిల్ ఇవ్వాలంటూ ఇంద్రాణి దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను విచారించిన సీబీఐ ప్ర‌త్యేక కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ గురువారం తీర్పు చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం సాయంత్రానికి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి కాగా...ఇంద్రాణి జైలు నుంచి విడుద‌లయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ త‌న‌ను నొప్పించిన వారంద‌రినీ క్ష‌మించేశాన‌ని, ఇన్నేళ్ల జైలు జీవితంలో చాలా నేర్చుకున్నాన‌ని ఆమె పేర్కొన్నారు.
Sheena Bora murder case
Indrani Mukerjea
Byculla Jail
Special CBI court

More Telugu News