ఎన్టీఆర్ కథపై బుచ్చిబాబు కసరత్తు పూర్తి కాలేదట!

20-05-2022 Fri 18:24
  • ఈ రోజున ఎన్టీఆర్ పుట్టినరోజు 
  • రెండు సినిమాల నుంచి అధికారిక  ప్రకటన 
  • లైన్లో లేని బుచ్చిబాబు ప్రాజెక్టు 
  • సెకండాఫ్ స్క్రిప్ట్ పై నడుస్తున్న కసరత్తు 
Ntr in Buchhi Babu movie
'ఉప్పెన' సినిమాతో దర్శకుడు బుచ్చిబాబు పేరు మారు మ్రోగిపోయింది. ప్రేమకథా చిత్రాలలో ఈ సినిమా ఒక కొత్త ట్రెండ్ సృష్టించింది. రికార్డుస్థాయిలో ఈ సినిమా వసూళ్లను రాబట్టింది. ఆ తరువాత సినిమాను ఆయన ఎన్టీఆర్ తో చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ సినిమాకి 'పెద్ది' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. 

అయితే ఈ రోజున ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో, కొరటాల సినిమా నుంచి ఫస్టు పోస్టర్ ను రిలీజ్ చేశారు. అలాగే ప్రశాంత్ నీల్ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. బుచ్చిబాబు సినిమాకి సంబంధించిన ప్రస్తావన మాత్రం ఎక్కడా లేదు. దాంతో ఈ ప్రాజెక్టు లేదని అంతా అనుకుంటున్నారు. 

అయితే ఈ ప్రాజెక్టు ఉందనేది తాజా వార్త. ఇంకా సెకండాఫ్ విషయంలో ఎన్టీఆర్ ను బుచ్చిబాబు ఒప్పించవలసి ఉందని అంటున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన స్క్రిప్ట్ పైనే కసరత్తు జరుగుతోందని చెబుతున్నారు. త్వరలోనే స్క్రిప్ట్ లాక్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఎన్టీఆర్ కమిట్ మెంట్స్ పూర్తయ్యేలోగా బుచ్చిబాబు మరో కథను మరో హీరోతో కానిచ్చేస్తాడని చెబుతున్నారు.