కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అన్నట్టు!...అంబ‌టిపై బుద్ధా వెంక‌న్న సెటైర్‌!

  • ఏ న‌దిపై ఏ ప్రాజెక్టు ఉందో తెలియ‌ని బ‌డుద్దాయి అంబ‌టి అన్న వెంకన్న 
  • పోల‌వ‌రం ప్రాజెక్టులో మా త‌ప్పులుంటే మూడేళ్లు ఏం పీకారు? అంటూ ప్రశ్న 
  • కుర్చీ కోసం దిగజారే నైజం జగన్ రెడ్డిదన్న వెంకన్న 
budda venkanna satires on ap cm ys jagan and ambati rambabu

ఏపీ జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి అంబ‌టి రాంబాబుపై టీడీపీకి చెందిన నేత‌లు వ‌రుస‌బెట్టి ఘాటు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా శుక్ర‌వారం టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న ట్విట్ట‌ర్ వేదిక‌గా అంబ‌టి రాంబాబుపై ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. అంబ‌టితో పాటు సీఎం జ‌గ‌న్‌పైనా బుద్ధా వెంక‌న్న సెటైర్లు సంధించారు. 

కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అన్నట్టుంది అంబటి రాంబాబు వ్యవహార శైలి అంటూ ఎద్దేవా చేసిన బుద్ధా... ఏ నది మీద ఏ ప్రాజెక్టు కడతారో తెలియని బడ్డుద్దాయి బడాయి మాటలు మాట్లాడుతున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మా తప్పు ఉంటే జగన్ రెడ్డి మూడేళ్లపాటు ఏం పీకార‌ని ప్ర‌శ్నించిన బుద్ధా.. ఒక్క పిల్ల కాలువ కూడా కట్టని మీ అధినేత, మీరు పోలవరం గురించి మాట్లాడితే ఫన్నీగా ఉంటుందని సెటైర్లు సంధించారు. 

కుర్చీ కోసం దిగజారే నైజం జగన్ రెడ్డిదన్న బుద్ధా వెంక‌న్న‌... నాన్న పోగానే సీఎంని చెయ్యమని సోనియా, రాహుల్ కాళ్ళపై జగన్ కుటుంబం పడిన విషయం మరిచిపోయారా? అని ప్ర‌శ్నించారు. ఎవడో పెట్టుకున్న పార్టీని కబ్జా చెయ్యడం నిజం కాదా? అంటూ ధ్వ‌జ‌మెత్తారు. కేసుల మాఫీ కోసం మోదీ కాళ్ళపై పడిన ఘటన గుర్తులేదా? అని నిల‌దీశారు. అమ్మని, చెల్లిని రాజకీయం కోసం వాడుకొని ఎడమ కాలితో తన్నిన కన్నింగ్ పొలిటీషయన్ జగనేన‌ని కూడా వెంకన్న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జగన్ రెడ్డి సింగిల్ గా వస్తున్నాడని మీరు అనుకుంటున్నారు, కానీ అతను అందరూ వదిలివేసిన ఒంటరి వాడని మీకు త్వరలోనే అర్థమవుతుందని తెలిపారు.

More Telugu News