లండ‌న్‌లో రాహుల్ గాంధీ.. ఐడియాస్ ఫ‌ర్ ఇండియా స‌ద‌స్సుకు హాజ‌రు

20-05-2022 Fri 17:07
  • ఐడియాస్ ఫ‌ర్ ఇండియా స‌ద‌స్సులో కీల‌క ప్ర‌సంగం
  • కాసేప‌ట్లో ఇండియా ఎట్ 75 స‌ద‌స్సుకూ హాజ‌రు
  • ఈ స‌ద‌స్సుల్లో పాల్గొనేందుకే లండ‌న్ వెళ్లిన రాహుల్‌
rahul gandhi in london tour
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ లండ‌న్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. ఐడియాస్ ఫ‌ర్ ఇండియా పేరిట నిర్వ‌హిస్తున్న స‌ద‌స్సుతో పాటు ఇండియా ఎట్ 75 పేరిట జ‌రుగుతున్న మ‌రో స‌ద‌స్సులో పాలుపంచుకునే నిమిత్త‌మే రాహుల్ గాంధీ లండ‌న్ వెళ్లారు. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం లండ‌న్‌లో జ‌రిగిన ఈ స‌ద‌స్సులో ఆయ‌న పాల్గొన్నారు. స‌ద‌స్సులో ఆయ‌న కీల‌క ప్ర‌సంగం చేశారు. ఈ స‌ద‌స్సు త‌ర్వాత అక్క‌డే ఇండియా ఎట్ 75 పేరిట జ‌ర‌గ‌నున్న మ‌రో కీల‌క కార్య‌క్ర‌మానికి కూడా ఆయ‌న హాజ‌రుకానున్నారు.