Sensex: భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు.. 1,534 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్!

  • 457 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • లాభాలను మూటకట్టుకున్న అన్ని సూచీలు
  • 8 శాతానికి పైగా లాభపడ్డ డాక్టర్ రెడ్డీస్ షేర్ విలువ
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలను మూటకట్టుకున్నాయి. ఆసియా మార్కెట్లలో సానుకూలతలు, ఐరోపా మార్కెట్లు లాభాలతో ప్రారంభం కావడం, యూఎస్ ఫ్యూచర్స్ లాభాల్లో పయనిస్తుండటం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. 

ఈ నేపథ్యంలో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,534 పాయింట్లు లాభపడి 54,326కి ఎగబాకింది. నిఫ్టీ 457 పాయింట్లు పెరిగి 16,266కి చేరుకుంది. ఈరోజు అన్ని సూచీలు లాభాలను మూటకట్టుకున్నాయి. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బీఎస్ఈ సెన్సెక్స్ లోని అన్ని కంపెనీల షేర్లు ఈరోజు లాభపడ్డాయి. డాక్టర్ రెడ్డీస్ (8.10%), రిలయన్స్ (5.77%), నెస్లే ఇండియా (4.74%), టాటా స్టీల్ (4.22%), ఎల్ అండ్ టీ (4.01%) టాప్ గెయినర్స్ గా ఉన్నాయి.

More Telugu News