Sanjana Galrani: మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ సంజన

Actress Sanjana Galrani gives birth to baby boy
  • లాక్ డౌన్ సమయంలో పెళ్లి చేసుకున్న సంజన
  • అజీజ్ పాషా అనే వైద్యుడిని పెళ్లాడిన వైనం
  • మగబిడ్డకు జన్మనిచ్చినట్టు ప్రకటించిన డాక్టర్ రీతూ
సినీ హీరోయిన్ సంజనా గల్రాని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమెకు వైద్యం అందించిన డాక్టర్ రీతూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే సంజనకు సోషల్ మీడియా వేదికగా అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

2020 లాక్ డౌన్ సమయంలో సంజన పెళ్లి చేసుకుంది. బెంగళూరుకు చెందిన అజీజ్ పాషా అనే వైద్యుడిని పెళ్లాడింది. తెలుగులో 'సోగ్గాడు' చిత్రం ద్వారా సంజన పరిచయం అయింది. ఆ తర్వాత 'ముగ్గురు', 'యమహో యమః', 'లవ్ యూ బంగారం', 'సర్దార్ గబ్బర్ సింగ్' తదితర చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.
Sanjana Galrani
Tollywood
Mother

More Telugu News