Chalapathi Chowdary: టాలీవుడ్ నటుడు చలపతి చౌదరి కన్నుమూత!

Tollywood actor Chalapathi Chowdary passes away
  • గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చలపతి చౌదరి
  • కర్ణాటకలోని రాయచూరులో మృతి
  • వందకు పైగా చిత్రాల్లో నటించిన చలపతి చౌదరి
ప్రముఖ సినీ నటుడు చలపతి చౌదరి కన్నుమూశారు. ఆయన వయసు 67 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన... కర్ణాటకలోని రాయచూరులో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. విజయవాడకు చెందిన చలపతి చౌదరి రాయచూరులో స్థిరపడ్డారు. 

చలపతి చౌదరి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వందకు పైగా సినిమాల్లో నటించారు. చిరంజీవి, బాలకృష్ణ, శివరాజ్ కుమార్ వంటి అగ్ర హీరోల సినిమాల్లో కీలక పాత్రలను పోషించారు. ఇటీవల ఘన విజయం సాధించిన బాలకృష్ణ 'అఖండ' చిత్రంలో కూడా నటించారు. పలు టీవీ సీరియల్స్ లో కూడా నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. మరోవైపు చలపతి మృతి పట్ల సినీ ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు.
Chalapathi Chowdary
Tollywood
Dead

More Telugu News