Canadian MP: కెనడా పార్లమెంటులో కన్నడలో ఉపన్యాసం దంచికొట్టిన ఎంపీ

Canadian MP speaks in Kannada in Parliament wins internet
  • భారత్ బయట పార్లమెంటులో కన్నడ మాట్లాడడం ఇదే మొదటిసారి
  • ప్రకటించిన ఎంపీ చంద్ర ఆర్య
  • ఎక్కడ ఉన్నా కన్నడ వాసిగానే అన్న మాటలతో ముగింపు
భారత సంతతికి చెందిన కెనడా ఎంపీ పార్లమెంటులో కన్నడ భాషలో ప్రసంగించి మాతృ భాష పట్ల మమకారం చాటుకున్నారు. కెనడా ఎంపీ చంద్ర ఆర్య కన్నడలో చేసిన ప్రసంగం ఎంతో మంది హృదయాలను గెలుచుకోగా.. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 

‘‘కెనడియన్ పార్లమెంటులో నేను నా మాతృభాష (మొదటి లాంగ్వేజ్)లో మాట్లాడాను. ఈ అందమైన భాషకు సుదీర్ఘమైన చరిత్ర ఉంది. 5 కోట్ల మంది ప్రజలు మాట్లాడతారు. భారత్ కు బయట ప్రపంచవ్యాప్తంగా ఒక పార్లమెంటులో కన్నడలో మాట్లాడడం ఇదే మొదటిసారి’’ అని చంద్ర ఆర్య ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. 

పార్లమెంటులో ప్రసంగించే అవకాశం లభించినప్పుడు ఆయన కన్నడలో మాట్లాడాలని ఉందని సభా అనుమతి తీసుకుని ప్రసంగించారు. రచయిత కువెంపు రాసిన, డాక్టర్ రాజ్ కుమార్ ఆలపించిన.. ‘‘నీవు ఎక్కడ ఉన్నా..ఎలా ఉన్నా.. ఎప్పుడూ కన్నడిగానే ఉండాలి’’ అన్న పాటతో ప్రసంగాన్ని ముగించారు. తోటి సభ్యులు చప్పట్లతో ఆయన్ను అభినందించడం గమనార్హం.

Canadian MP
speaks
Kannada
Canadian parliament

More Telugu News