తెలుగు వార్తా స్ర‌వంతిలోకి మ‌రో ఛానెల్‌... 'స్వతంత్ర‌'ను ప్రారంభించిన ఏపీ సీఎం జ‌గ‌న్‌

19-05-2022 Thu 21:45
  • హైద‌రాబాద్ కేంద్రంగా కార్య‌క‌లాపాలు
  • స్టూడియోల‌ను ప్రారంభించిన జ‌గ‌న్‌
  • త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్న‌ ఛానెల్ ప్ర‌సారాలు
ap cm ys jagan virtually launched the Swatantra channel studios
తెలుగు వార్తా స్ర‌వంతిలోకి మ‌రో న్యూస్ ఛానెల్ ఎంట్రీ ఇచ్చింది. స్వ‌తంత్ర పేరిట స‌రికొత్త‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ఛానెల్ కార్యాల‌యాల‌ను ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గురువారం రాత్రి లాంఛ‌నంగా ప్రారంభించారు. హైద‌రాబాద్ కేంద్రంగా కార్య‌క‌లాపాలు సాగించ‌నున్న ఈ ఛానెల్ కు చెందిన హైద‌రాబాద్ స్టూడియోల‌ను జ‌గ‌న్ తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యం నుంచి వ‌ర్చువ‌ల్ పద్ధతిలో ప్రారంభించారు. స్వ‌తంత్ర న్యూస్ ఛానెల్ ప్ర‌సారాలు త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్నాయి.