తెలంగాణలో తాజాగా 47 మందికి కరోనా పాజిటివ్

19-05-2022 Thu 21:21
  • గత 24 గంటల్లో 12,458 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 36 కొత్త కేసులు
  • రంగారెడ్డి జిల్లాలో ఏడుగురికి పాజిటివ్
  • కరోనా నుంచి కోలుకున్న 34 మంది
  • ఇంకా 396 మందికి చికిత్స
Telangana corona daily bulletin
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 12,458 కరోనా పరీక్షలు నిర్వహించగా, 47 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో అత్యధికంగా 36 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 7, సంగారెడ్డి జిల్లాలో 1, సూర్యాపేట జిల్లాలో 1, నారాయణపేట జిల్లాలో 1, కరీంనగర్ జిల్లాలో ఒక కేసు వెల్లడయ్యాయి. అదే సమయంలో 34 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనాతో కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. 

తెలంగాణలో ఇప్పటివరకు 7,92,757 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,88,250 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 396 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.