రాజ‌కీయాల‌కు బ‌లి చేయొద్దంటూ కిన్నెర క‌ళాకారుడు మొగుల‌య్య ఆవేద‌న‌

19-05-2022 Thu 21:08
  • మొగుల‌య్య‌కు కోటి న‌జ‌రానా ప్ర‌క‌టించిన కేసీఆర్‌
  • ఆ న‌గ‌దు త‌న‌కు ఇంకా అంద‌లేద‌న్న మొగుల‌య్య‌
  • ఆ వ్యాఖ్య‌ల ఆడియోను సోష‌ల్ మీడియాలో పెట్టేసిన ఓ నేత‌
  • దానిపై స్పందిస్తూ మొగుల‌య్య వీడియో విడుద‌ల‌
kinnera mogulaiah releases a video
ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత, కిన్నెర క‌ళాకారుడు ద‌ర్శ‌నం మొగుల‌య్య‌ గురువారం ఓ ఆవేద‌నాభ‌రిత వీడియోను విడుద‌ల చేశారు. త‌న‌ను రాజ‌కీయంగా బ‌లి చేయొద్దని, అలా చేసి త‌న నోట్లో మ‌ట్టి కొట్టొద్ద‌ని ఆయ‌న రాజ‌కీయ నేత‌ల‌ను వేడుకున్నారు. మొగుల‌య్య విడుద‌ల చేసిన ఈ వీడియోకు దారి తీసిన ప‌రిణామాలు ఇలా ఉన్నాయి.

ప‌ద్మ‌శ్రీ అవార్డుకు ఎంపికైన మొగుల‌య్య‌కు తెలంగాణ ప్ర‌భుత్వం త‌ర‌ఫున కోటి రూపాయ‌ల న‌జ‌రానాను సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ మొత్తం న‌గ‌దు త‌న‌కు ఇంకా అందలేద‌ని త‌న‌ను క‌లిసిన ఓ రాజ‌కీయ నాయకుడి వ‌ద్ద మొగుల‌య్య ప్ర‌స్తావించారట‌.

మొగుల‌య్య చెప్పిన ఈ మాట‌ల‌ను ఆ నేత మొగుల‌య్య‌కు తెలియ‌కుండానే రికార్డు చేసి ఆడియోను సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేశారు‌. ఈ విష‌యం తెలిసిన వెంట‌నే స్పందించిన మొగుల‌య్య త‌న‌ను రాజ‌కీయాల‌కు బ‌లి చేయొద్ద‌ని నేత‌ల‌ను వేడుకున్నారు.