ఐదు భాషల్లో ఎన్టీఆర్ 30వ చిత్రం... కొరటాల శివ దర్శకత్వం... రౌద్రం ఉట్టిపడేలా స్పెషల్ వీడియో

  • రేపు ఎన్టీఆర్ పుట్టినరోజు
  • ఫ్యాన్స్ కు అదిరిపోయే కానుక
  • మరో రేంజిలో ఎన్టీఆర్ హీరోయిజం
  • ఒక్క వీడియోతోనే అభిమానులకు గూస్ బంప్స్
NTR30 officially announced

జూనియర్ ఎన్టీఆర్ మరోసారి రౌద్రరూపం ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు. ఆయన 30వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ స్పెషల్ వీడియోను చిత్రబృందం పంచుకుంది. రేపు (మే 20) ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులకు పసందైన కానుక అందించింది. 

అల్లకల్లోలంగా ఉన్న సముద్రం... ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు, అతలాకుతలం అవుతున్న పడవలు... మధ్యలో రెండు చేతులా మారణాయుధాలతో ఎన్టీఆర్ హీరోయిజం ఉట్టిపడేలా వీడియో ఉంది. "అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు... అవసరానికి మించి దమ్ముండకూడదని" అంటూ బ్యాక్ గ్రౌండ్ లో వినిపించే డైలాగులు సినిమా స్టోరీ సీరియస్ నెస్ ను చాటుతున్నాయి. 

ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఎన్టీఆర్ 30వ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడు. నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకుంటున్నాయి. త్వరలోనే ఇతర తారాగణం వివరాలు వెల్లడించనున్నారు.

More Telugu News