YSRCP: రేపే విదేశీ పర్యటనకు జగన్... 10 రోజుల పాటు అక్కడే

ap cm ys jagan starts his forgien tour tomorrow morning
  • రేపు ఉద‌యం 7.30 గంట‌ల‌కు ప్ర‌త్యేక విమానంలో ప‌య‌నం
  • సాయంత్రం 6 గంట‌ల‌కు జ్యూరిచ్ చేరుకోనున్న జ‌గ‌న్‌
  • రాత్రి 8.30 గంట‌ల‌కు దావోస్‌కు చేరిక‌
ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విదేశీ ప‌ర్య‌ట‌న రేప‌టి నుంచి మొద‌లు కానుంది. దావోస్‌లో జ‌రిగే వ‌రల్డ్ ఎక‌న‌మిక్ ఫోరం స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యే నిమిత్తం జ‌గ‌న్ ఫారిన్ టూర్ వెళుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ స‌ద‌స్సుకు హాజ‌రుకానున్న ఏపీ ప్ర‌తినిధి బృందానికి జ‌గ‌నే నేతృత్వం వ‌హించ‌నున్నారు. 

ఈ ప‌ర్య‌ట‌న నిమిత్తం ఇప్ప‌టికే నాంప‌ల్లి సీబీఐ కోర్టు నుంచి అనుమ‌తి తీసుకున్న జ‌గ‌న్‌... శుక్ర‌వారం ఉద‌యం 7.30 గంట‌ల‌కు గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్టు నుంచి ప్ర‌త్యేక విమానంలో బ‌య‌లుదేర‌తారు. సాయంత్రం 6 గంట‌ల స‌మ‌యానికి ఆయ‌న జ్యూరిచ్ చేరుకుంటారు‌. అక్క‌డి నుంచి బ‌య‌లుదేరి శుక్ర‌వారం రాత్రి 8.30 గంట‌ల‌కు జ‌గ‌న్ బృందం దావోస్ చేరుకోనుంది. 10 రోజుల పాటు జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌న‌లోనే ఉండ‌నున్నారు.
YSRCP
YS Jagan
Andhra Pradesh
Davos

More Telugu News