ఈ నెల 21న శిల్పకళావేదికలో 'ఎఫ్3' ప్రీ రిలీజ్ వేడుక

  • వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా ఎఫ్3
  • అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిత్రం
  • ఈ నెల 27న ఎఫ్3 రిలీజ్
  • ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ప్రకటన చేసిన చిత్రబృందం
F3 Pre Release event will held on May 21st

తెలుగు ప్రేక్షకులకు నవ్వుల విందు అందించేందుకు ఎఫ్3 చిత్రం వస్తోంది. వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, సునీల్, సోనాల్ చౌహాన్, రాజేంద్రప్రసాద్ నటించిన ఈ చిత్రం మే 27న విడుదల కానుంది. కాగా, ఎఫ్3 చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 21న హైదరాబాదులో నిర్వహించనున్నారు. శిల్పకళావేదిక ప్రాంగణంలో సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు చిత్రనిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వెల్లడించింది. 'ఫన్'టాస్టిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అంతా సిద్ధం అని పేర్కొంది. 

వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్2 చిత్రం హిట్టయిన సంగతి తెలిసిందే. ఇప్పుడదే కాంబోలో వస్తున్న ఎఫ్3 చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈసారి వెంకీ, వరుణ్ లకు కామెడీ కింగ్ సునీల్ కూడా తోడవడంతో వినోదం ఏ రేంజిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.
.

More Telugu News