'అఖండ' సీక్వెల్ కథపై జరుగుతున్న కసరత్తు!

19-05-2022 Thu 18:38
  • 'అఖండ'తో సంచలన విజయాన్ని సాధించిన బోయపాటి 
  • సీక్వెల్ ఉందంటూ ముందుగానే ఇచ్చిన హింట్
  • సీక్వెల్ కథపై పనిచేస్తున్న రైటింగ్ డిపార్టుమెంట్  
  • బాలయ్య కమిట్ మెంట్స్ పూర్తి కాగానే సెట్స్  పైకి
Akhanda sequel update
బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి తెరకెక్కించిన 'అఖండ' సంచలన విజయాన్ని సాధించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ వసూళ్లలోను కొత్త రికార్డులను నమోదు చేసింది. బాలకృష్ణ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా పెద్దలతో పాటు పిల్లలను కూడా అదే స్థాయిలో ఆకట్టుకోవడం విశేషం.

అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ ఉందన్నట్టుగా బోయపాటి హింట్ ఇచ్చాడు. ఆ తరువాత ఈ సినిమాకి సంబంధించిన వేదికలపై ఆయన మాట్లాడుతూ కూడా ఈ సినిమాకి సీక్వెల్ ఉందనే క్లారిటీ ఇచ్చాడు. అయితే అందుకు సమయం ఉందని చెప్పాడు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కథపైనే బోయపాటి రైటింగ్ డిపార్టుమెంట్ వర్క్ చేస్తున్నట్టుగా సమాచారం. 

ఈ సినిమాలోని పాప .. టీనేజ్ లోకి అడుగుపెట్టడం .. ఆమెకి ఇచ్చిన మాట కోసం అఖండ మళ్లీ రావడంతో సీక్వెల్ కథ మొదలవుతుందని అంటున్నారు. గోపీచంద్ మలినేని .. అనిల్ రావిపూడి సినిమాలను బాలయ్య పూర్తి చేసిన తరువాత, ఆయనను తీసుకుని బోయపాటి సెట్స్ పైకి వెళతాడని చెబుతున్నారు.