త్రివిక్రమ్ .. మహేశ్ బాబు మూవీలో నాని?

19-05-2022 Thu 18:08
  • త్వరలో త్రివిక్రమ్ తో సెట్స్ పైకి మహేశ్ బాబు
  • గెస్టు పాత్ర కోసం నానీతో సంప్రదింపులు
  • ఆయన అంగీకరించే ఛాన్స్ ఉందంటూ టాక్ 
  • మహేశ్ తో మరోసారి జోడీ కడుతున్న పూజ హెగ్డే
Trivikram and Mahesh Babu movie update
త్రివిక్రమ్ సినిమా అంటే అది అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చిన విందులా ఉంటుంది. అంతలా ఆయన తన సినిమా కథల్లో అన్ని అంశాలను అందంగా సర్దుతారు. ఆయన తాజా చిత్రం మహేశ్ బాబు హీరోగా రూపొందనుంది. ఈ సినిమా కోసమే త్రివిక్రమ్ అన్ని ఏర్పాట్లను రెడీ చేసుకుంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. 

మహేశ్ తో త్రివిక్రమ్ చేస్తున్న మూడో సినిమా ఇది. అందువలన సహజంగానే అందరిలో అంచనాలు ఉన్నాయి. సహజంగానే త్రివిక్రమ్ తన సినిమాల్లో చిన్న చిన్న పాత్రలకు కూడా పెద్ద ఆర్టిస్టులను పెడుతుంటారు. అతిథి పాత్రల కోసం కూడా స్టార్లనే పట్టుకొస్తుంటారు. అలా ఈ సినిమాలోని ఒక గెస్టు రోల్ కోసం నానీని సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తోంది. 

కథ .. పాత్ర నచ్చితే చేయడానికి నానీకి అభ్యంతరం ఉండకపోవచ్చు. పైగా ఈ సినిమాలో ఒక వైపు త్రివిక్రమ్ .. మరో వైపున మహేశ్ బాబు .. అందువలన ఆయన ఒప్పుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ నాని మరే కారణం చేతనైనా చేయకపోతే, ఆ తరువాత ఆప్షన్ ఎవరనేదే అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్న విషయం. ఈ సినిమాలో మహేశ్ సరసన పూజ హెగ్డే సందడి చేయనున్న సంగతి తెలిసిందే.