200 కోట్ల గ్రాస్ దిశగా 'సర్కారువారి పాట'

19-05-2022 Thu 17:37
  • ఈ నెల 12న విడుదలైన 'సర్కారువారి పాట'
  • నిన్నటితో వారం రోజులను పూర్తిచేసుకున్న సినిమా
  • తొలివారం వసూళ్లు 171 కోట్ల గ్రాస్
  • 200 కోట్ల గ్రాస్ మార్క్ పైనే అందరి దృష్టి
Sarkaru Vaari Paata movie update
మహేశ్ బాబు - పరశురామ్ కాంబినేషన్లో  రూపొందిన 'సర్కారువారి పాట' ఈ నెల 12వ తేదీన థియేటర్లకు వచ్చింది.  మైత్రీ -  14 రీల్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి, మహేశ్ బాబు కూడా ఒక నిర్మాతగా ఉన్నాడు. ఈ సినిమాలో కథానాయికగా కీర్తి  సురేశ్ సందడి చేసింది. రికార్డుస్థాయి ఓపెనింగ్స్ తో ఈ సినిమా తన ప్రయాణాన్ని ప్రారంభించింది.

ఈ సినిమా విడుదలై నిన్నటితో వారం రోజులైంది. ఈ వారం రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 171 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ సినిమా 200 కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేస్తుందేమో చూడాలి. దర్శకుడు పరశురామ్ ఈ సినిమాలో మహేశ్ బాబు .. కీర్తి సురేశ్ లను కొత్తగా చూపించాడు. ఈ ఇద్దరి పాత్రలను తీర్చిదిద్దిన తీరు కూడా కొత్తగా అనిపించింది. 

ఇక పాటలు .. ఫైట్లు .. కామెడీ ఈ సినిమాకి అదనపు బలాన్ని చేకూర్చాయి. ఈ సినిమాలో లవ్ ట్రాక్ తనకి బాగా నచ్చిందనీ, ఈ క్రెడిట్ అంతా కూడా పరశురామ్ కి దక్కుతుందని మహేశ్ బాబు అనడం విశేషం.   .