CM Jagan: సీఎం జగన్ ఎదుట ఇంగ్లీషులో దంచికొట్టిన బెండపూడి ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులు

Bendapudi high school students talk to CM Jagan with fluent english
  • ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం
  • సీఎం జగన్ ను కలిసిన కాకినాడ జిల్లా విద్యార్థులు
  • పలు పథకాలతో సీఎం స్ఫూర్తిగా నిలిచారని వెల్లడి
  • పిల్లల ఆంగ్ల భాషా ప్రావీణ్యానికి ముగ్ధుడైన సీఎం జగన్
కాకినాడ జిల్లా బెండపూడి ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులు ఇటీవలి కాలంలో వాట్సాప్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాలలో ఎంతగానో పాప్యులర్ అయ్యారు. ఆంగ్లంలో.. మరీ ముఖ్యంగా అమెరికన్ యాసలో.. నదురూ బెదురూ లేకుండా ఆ చిన్నారులు మాట్లాడే తీరు అందర్నీ బాగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆ స్కూలు విద్యార్థులు కొందరు సీఎం జగన్ ను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. 

వారు సీఎం ఎదుట ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడిన వైనం అందరినీ ఆకట్టుకుంటోంది. వారు ఎలాంటి తడబాటు లేకుండా సీఎం జగన్ తో ఇంగ్లీషులో మాట్లాడడం విశేషం. అమ్మ ఒడి, ఆంగ్ల మాధ్యమంలో బోధన, నాడు-నేడు పథకాల విశిష్టతను వారు ఇంగ్లీషులో చక్కగా వివరించారు. ఇలాంటి పథకాలతో అందరికీ స్ఫూర్తిగా నిలిచారంటూ సీఎం జగన్ ను ప్రస్తుతించారు.

ఆ చిన్నారుల నోట ప్రభుత్వ పథకాల గురించి మంచి మాటలు రావడంతో సీఎం మోము వెలిగిపోయింది. ముఖ్యంగా, ప్రభుత్వ పాఠశాల పిల్లలు ఇంగ్లీషులో మాట్లాడడం ఆయనను అమితానందానికి గురిచేసింది. వారి ఆంగ్ల భాషా ప్రావీణ్యాన్ని ఆద్యంతం చిరునవ్వుతో ఆస్వాదించిన సీఎం, ఆ విద్యార్థులను మనస్ఫూర్తిగా అభినందించారు
CM Jagan
Students
English
Bendapudi High School
Kakinada District
YSRCP
Andhra Pradesh

More Telugu News