భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరెంట్ 'షాక్'.. రేకుల ఇంటికి రూ. 7 లక్షలకు పైగా విద్యుత్ బిల్లు!

  • లక్ష్మీదేవిపల్లి హమాలీ కాలనీకి చెందిన సంపత్ కుటుంబానికి రూ. 7.2 లక్షల బిల్లు
  • బిల్లు కలెక్టర్ ను అడిగినా సమాధానం రాలేదని ఆవేదన
  • ప్రతి నెల రూ. 400 వరకు వచ్చేదని వెల్లడి
Poor family gets 7 laks electricity bill

పూరి గుడిసెల్లో ఉన్న వారికి కూడా అప్పుడప్పుడు వేల రూపాయల కరెంట్ బిల్లులు రావడం మనకు తెలిసిన విషయమే. తాజాగా అలాంటి ఘటనే మరొకటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. ఓ ఫ్యాన్, టీవీ మాత్రమే ఉన్న రేకుల ఇంటికి ఏకంగా రూ. 7.2 లక్షల కరెంట్ బిల్లు వచ్చింది. 

లక్ష్మీదేవిపల్లి హమాలీ కాలనీకి చెందిన మాడిశెట్టి సంపత్ కుటుంబం గత నెలలో 117 యూనిట్ల విద్యుత్ ను వినియోగించింది. దీనికి గాను 7 లక్షలకు పైగా కరెంట్ బిల్లు వచ్చింది. దీంతో వాళ్లు షాక్ కు గురయ్యారు. లక్షల్లో బిల్లు రావడమేంటని బిల్లు కలెక్టర్ ను అడిగినా సమాధానం ఇవ్వలేదని సంపత్ వాపోయాడు. తమకు సగటున రూ. 400 వరకు కరెంట్ బిల్లు వచ్చేదని చెప్పాడు.

More Telugu News