Sensex: కుప్పకూలిన మార్కెట్లు.. 1,416 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్!

  • మార్కెట్లపై ప్రభావం చూపిన అంతర్జాతీయ ప్రతికూలతలు
  • 430 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • 5.78 శాతం నష్టపోయిన హెచ్సీఎల్
Sensex looses 1416 points

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కుప్పకూలాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,416 పాయింట్లు కోల్పోయి 52,792కి పడిపోయింది. నిఫ్టీ 430 పాయింట్లు నష్టపోయి 15,809కి దిగజారింది. ఈరోజు అన్ని సూచీలు నష్టాలను మూటకట్టుకున్నాయి. ముఖ్యంగా ఐటీ, మెటల్ సూచీలు 4 నుంచి 5 శాతం వరకు నష్టపోయాయి. 

అమెరికాతో పాటు ప్రపంచ మార్కెట్లు నష్టపోవడం మన మార్కెట్లపై ప్రభావం చూపింది. యూకేలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠానికి చేరుకోవడం కూడా ఇన్వెస్టర్ల ఆందోళనకు కారణమయింది. ఈ నేపథ్యంలో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సెన్సెక్స్ లో కేవలం ఐటీసీ (3.53%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (0.82%) మాత్రమే లాభపడ్డాయి. 

టాప్ లూజర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-5.78%), విప్రో (-5.75%), ఇన్ఫోసిస్ (-5.28%), టీసీఎస్ (-5.16%), టెక్ మహీంద్రా (-5.07%).

More Telugu News