Marriage: తాళి క‌ట్టే స‌మ‌యంలో పెళ్లి వ‌ద్ద‌న్న వ‌ధువు!.. పెళ్లి పీటలపైనే స్పృహ త‌ప్పిన‌ వ‌రుడు!

Bride Calls of Wedding and Groom Faints on Stage
  • ఒడిశాలోని బాలాసోర్ జిల్లా రేమ్ గ్రామంలో ఘ‌ట‌న‌
  • త‌న‌కు అప్ప‌టికే పెళ్లి అయ్యింద‌న్న వ‌ధువు
  • ఎందుకు చెప్ప‌లేదంటూ వ‌ధువు చెంప‌లు వాయించిన‌ త‌ల్లిదండ్రులు
  • సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన వీడియో
ఇంకాసేపు ఉంటే వ‌రుడు తాళి క‌డ‌తాడు. అయితే అప్ప‌టిదాకా బాగానే ఉన్న వ‌ధువు ఉన్న‌ట్టుండి త‌న‌కు పెళ్లి ఇష్టం లేద‌ని బాంబు లాంటి మాట చెప్పింది. త‌న‌కు అప్ప‌టికే వేరే వ్య‌క్తితో పెళ్లి అయిపోయింద‌ని కూడా వ‌ధువు చెప్పేసింది. ఇంకేముంది... కాసేప‌ట్లో తాళి క‌డ‌తాన‌న్న సంతోషంలో నుంచి షాక్‌లోకి వెళ్లిపోయిన వ‌రుడు పెళ్లి మండ‌పంలో తాను కూర్చున్న పెళ్లి పీటలపైనే స్పృహ తప్పి పడిపోయాడు. 

ఈ వెధ‌వ ప‌నిని ముందే ఎందుకు చెప్ప‌లేదంటూ వ‌ధువును ఆమె త‌ల్లిదండ్రులు, బంధువులు పెళ్లి మండంపైనే చెంప‌లు వాయించేశారు. ఈ ఘ‌ట‌న ఒడిశాలోని బాలాసోర్ జిల్లా రేమ్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌కు చెందిన వీడియో సోష‌ల్ మీడియాలో ఇప్పుడు చ‌క్క‌ర్లు కొడుతోంది. 
Marriage
Odisha
Balasore District

More Telugu News