Subramanian Swamy: ఈ అంశంలో మోదీ విఫలమయ్యారు: సుబ్రహ్మణ్యస్వామి

Subramanian Swmay criticizes PM Narendara Modi
  • మోదీపై సుబ్రహ్మణ్యస్వామి విమర్శలు
  • ప్రార్థనా స్థలాల చట్టాన్ని రద్దు చేయలేకపోయారని వెల్లడి
  • మోదీ చర్యలు తీసుకోలేకపోయారని వ్యాఖ్యలు

అధికార బీజేపీలోనే ఉన్నప్పటికీ, అధినాయకత్వంపై విమర్శించడానికి ఏమాత్రం వెనుకాడని సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి మరోసారి తనదైన శైలిలో స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేశారు. లోక్ సభలో పూర్తి మెజారిటీతో, రాజ్యసభలో వాస్తవ మెజారిటీతో 8 ఏళ్లు ప్రధానిగా ఉన్నా గానీ, ప్రార్థనా స్థలాల చట్టం-1991ని ఉపసంహరించుకునే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారని పేర్కొన్నారు. ఈ చట్టం రద్దు కోసం పార్లమెంటు నిర్ణయం తీసుకునేలా మోదీ కీలకపాత్ర పోషిస్తారని ఆశిస్తే, ఆ విషయంలో విఫలమయ్యారని తెలిపారు.

  • Loading...

More Telugu News