Nara Lokesh: ఏపీలోని రోడ్ల దుస్థితిపై చినజీయర్ స్వామి ఆవేదనతో స్పందించారు: నారా లోకేశ్

Chinjiyar Swamy reacted angrily to the dilapidated condition of the roads in AP says Nara Lokesh
  • రాష్ట్రంలో రోడ్లు నడిచేందుకు కూడా వీలుగా లేవని జనాలు గగ్గోలు పెడుతున్నారన్న లోకేశ్ 
  • అధ్వాన పాలనకు ఉదాహరణగా పక్క రాష్ట్ర పాలకులు ఏపీని ఉదాహరణగా చూపిస్తున్నారని వ్యాఖ్య 
  • రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో చినజీయర్ స్వామి వ్యాఖ్యలతో అర్థమవుతుందన్న టీడీపీ నేత 
ఏపీలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. రాష్ట్రంలో రోడ్లు నడిచేందుకు కూడా వీలుగా లేవని జనాలు గగ్గోలు పెడుతున్నారని అన్నారు. పక్క రాష్ట్ర పాలకులు అధ్వాన పాలనకు ఉదాహరణగా మన రాష్ట్రాన్నే చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని చెప్పారు. 

రాజకీయలకు దూరంగా, ఆధ్యాత్మిక ప్రపంచానికి దగ్గరగా, హిందూ ధర్మ ప్రచారమే జీవిత లక్ష్యంగా సాగుతోన్న చినజీయర్ స్వామి ఏపీలోని రహదారుల దుస్థితిపై ఆవేదనతో స్పందించారని లోకేశ్ చెప్పారు. గతుకులు, గుంతలు, ఒడిదుడుకుల గురించి ప్రస్తావిస్తూనే... జంగారెడ్డిగూడెం నుంచి రాజమండ్రి వరకు రోడ్డు ప్రయాణం ఒక జ్ఞాపకంగా మిగిలిపోనుందని రోడ్ల దుస్థితిని భక్తులకు చెపుతూ... ప్రవచనంలో భాగంగా వ్యాఖ్యానించడం చూస్తుంటే.. జగన్ రెడ్డి పాలనలో రహదారులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతుందని లోకేశ్ అన్నారు.
Nara Lokesh
Telugudesam
Chinna Jeeyar Swamy
Andhra Pradesh
Roads
Jagan
YSRCP

More Telugu News