MONKEYPOX: మంకీ పాక్స్ వైరస్ లక్షణాలు ఇవీ..!

  • చర్మంపై బొబ్బల్లాంటి కణుపులు
  • ప్రధానంగా ఎలుకల ద్వారా వ్యాప్తి
  • శరీర ద్రవాల నుంచి కూడా సోకొచ్చు
WHAT IS MONKEYPOX

ఆర్థో పాక్స్ వైరస్ కటుంబానికి చెందినదే మంకీ పాక్స్ వైరస్. 1958లో తొలిసారిగా దీన్ని గుర్తించారు. స్మాల్ పాక్స్ తెలుసుకదా అది కూడా ఈ కుటుంబానిదే. స్మాల్ పాక్స్ లో కంటే మంకీ పాక్స్ లో లక్షణాల తీవ్రత తక్కువగా ఉంటుంది. స్మాల్ పాక్స్ ను 1980ల్లోనే టీకాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా నిర్మూలించగలిగారు. కానీ, మంకీ పాక్స్ ఇప్పటికీ పశ్చిమ, సెంట్రల్ ఆఫ్రికా దేశాల్లో మనుగడలో ఉంది. 

లక్షణాలు..
మంకీ పాక్స్ వైరస్ ను చర్మంపై ర్యాషెస్ రూపంలో గుర్తించొచ్చు. బొబ్బల మాదిరిగా (కణుపులు మాదిరి) చర్మం అంతటా పాకొచ్చు. ఫ్లూ మాదిరి లక్షణాలు కూడా ఉంటాయి. జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, అలసట, కండరాల నొప్పులు కనిపిస్తాయి. 

తేడా..
మంకీ పాక్స్ వైరస్ లో బొబ్బలు (కణుపులు) కనిపిస్తాయి. అదే స్మాల్ పాక్స్ లో ఇవి ఉండవు.

వ్యాప్తి
సన్నిహితంగా మెలగడం ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. జంతువులు, మనుషుల నుంచి ఇది వ్యాపించొచ్చు. ఎలుకలే ఈ వైరస్ వ్యాప్తికి ప్రధాన కారకాలుగా ఉంటున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న దాని ప్రకారం.. శరీర ద్రవాలు, చర్మంపై పుండ్ల ద్వారా, నోటిలోని ద్రవాల నుంచి, శ్వాస తుంపర్ల నుంచి ఈ వైరస్ వ్యాపిస్తుంది.

More Telugu News