LPG: సామాన్యుల నెత్తిన మళ్లీ ‘బండ’.. డొమెస్టిక్ సిలిండర్‌పై రూ. 3.50 పెంపు

  • ఈ నెలలో రెండోసారి పెంపు
  • తాజా పెంపుతో దేశవ్యాప్తంగా రూ. 1000 దాటేసిన సిలిండర్ ధర
  • కమర్షియల్ సిలిండర్ ధరపై రూ. 8 పెంపు
  • కోల్‌కతాలో అత్యధికంగా రూ. 1029కి చేరుకున్న సిలిండర్ ధర
LPG price hiked again cylinder rates cross Rs 1000

గత కొంతకాలంగా అడ్డుఅదుపు లేకుండా పెరుగుతున్న వంటగ్యాస్ ధరలు తాజాగా మరోమారు పెరిగాయి. గృహ వినియోగ వంటగ్యాస్ ధర రూ. 3.50, వాణిజ్య సిలిండర్ ధర రూ. 8 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. గ్యాస్ ధరలు పెరగడం ఈ నెలలో ఇది రెండోసారి కావడం గమనార్హం. తాజా పెంపుతో డొమెస్టిక్ సిలిండర్ ధర దేశవ్యాప్తంగా రూ. 1000 దాటేసింది. 

ఈ పెంపుతో కలుపుకుని ఢిల్లీ, ముంబైలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 1003కు చేరుకోగా, కోల్‌కతాలో రూ. 1029, చెన్నైలో 1018.5కి చేరుకుంది. కాగా, ఈ నెల 7న సిలిండర్ ధరను ప్రభుత్వం ఏకంగా రూ. 50 పెంచిన విషయం తెలిసిందే.

More Telugu News