Sathyadev: సత్యదేవ్ 'గాడ్సే' రిలీజ్ డేట్ ఖరారు!

Godse Movie Update
  • విలక్షణ నటుడిగా సత్యదేవ్ కి పేరు
  • తాజా చిత్రంగా రూపొందిన 'గాడ్సే'
  • కథానాయికగా ఐశ్వర్య లక్ష్మి పరిచయం 
  • జూన్ 17వ తేదీన ఈ సినిమా విడుదల
మొదటి నుంచి కూడా సత్యదేవ్ విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేస్తూ వస్తున్నాడు. 'బ్రోచేవారెవరురా' .. 'రాగల 24 గంటల్లో' సినిమాలు ఆయనకి మంచి పేరును తెచ్చిపెట్టాయి. చిరంజీవి సినిమా 'ఆచార్య'లో ఒక చిన్న పాత్రలో తళుక్కున మెరిసిన ఆయన, 'గాడ్ ఫాదర్' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను చేశాడు.
 
సత్యదేవ్ తాజా చిత్రంగా 'గుర్తుందా శీతాకాలం' సినిమా విడుదలకి సిద్ధంగా ఉండగానే, ఆయన 'గాడ్సే' సినిమా కూడా రిలీజ్ డేట్ ను ఖరారు చేసుకుంది. జూన్ 17వ తేదీన ఈ సినిమా విడుదల తేదీని ఫిక్స్ చేశారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను వదిలారు. 

సి. కల్యాణ్ నిర్మించిన ఈ సినిమాకి గోపీ గణేశ్ దర్శకత్వం వహించాడు. సునీల్ కాశ్యప్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, సత్యదేవ్ సరసన ఐశ్వర్య లక్ష్మి కనిపించనుంది. తమిళ .. మలయాళ భాషల్లో మంచి క్రేజ్ ఉన్న ఆమెకి తెలుగులో ఇది మొదటి సినిమా. ఈ సినిమాలో నాగబాబు ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు.
Sathyadev
Aoshwarya Lakshmi
Sunil Kashyap
Godse Movie

More Telugu News