Konaseema: కోన‌సీమ జిల్లా పేరు మారుస్తూ ఏపీ ప్ర‌భుత్వం నిర్ణయం

ap government willing to changes the konaseema district
  • డాక్ట‌ర్‌ బీఆర్ అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లాగా మార్పు
  • ఈ దిశ‌గా ద‌ళిత‌, ప్ర‌జా సంఘాల ఆందోళ‌న‌లు
  • త్వ‌ర‌లోనే ఉత్త‌ర్వులు జారీ చేయ‌నున్న ప్ర‌భుత్వం
ఏపీలో ఇటీవ‌లే 13 కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇలా  అమ‌లాపురం కేంద్రంగా ఏర్పాటైన కొత్త జిల్లా కోన‌సీమ జిల్లా పేరు మార్పు దిశ‌గా ప్ర‌భుత్వం బుధ‌వారం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ జిల్లా పేరును డాక్ట‌ర్‌ బీఆర్ అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లాగా మార్చేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. 

కొత్త జిల్లాల‌కు సంబంధించి క‌స‌ర‌త్తు మొద‌లైన నాటి నుంచి కూడా కోనసీమ జిల్లాకు అంబేద్క‌ర్ పేరుపెట్టాల‌ని ద‌ళిత సంఘాలు, ప్ర‌జా సంఘాలు డిమాండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ డిమాండ్ కోసం ఆయా సంఘాలు పెద్ద ఎత్తున నిర‌స‌న‌ల‌కు కూడా దిగాయి. అయితే నాడు ఈ నిర‌స‌న‌ల‌ను అంత‌గా ప‌ట్టించుకోని ప్ర‌భుత్వం... తాజాగా జిల్లా పేరును మార్చేందుకు నిర్ణ‌యించింది. ఈ మేర‌కు త్వ‌ర‌లోనే ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.
Konaseema
Andhra Pradesh
New District
Dr. B R Ambedkar Konaseema District

More Telugu News