Tim David: టిమ్ డేవిడ్ వల్లే.. మా ఆశలు గల్లంతయ్యాయి: టామ్ మూడీ

If not for Tim David we would have made a bigger impression SunRisres Hyderabad coach Tom Moody
  • డేవిడ్ అసాధారణ ఇన్నింగ్స్ తో ఆధిక్యం తగ్గిపోయిందన్న సన్ రైజర్స్ కోచ్
  • అద్భుతమైన ఆటతో ముంబైని పోటీలోకి తీసుకొచ్చాడంటూ కితాబు  
  • విజయం సాధించడం తమ మొదటి ప్రాధాన్యమన్న టామ్ మూడీ  

ఐపీఎల్ 2022లో సన్ రైజర్స్ హైదరాబాద్ కథ ముగిసినట్టే. 13 మ్యాచుల్లో ఆరు విజయాలు సాధించిన ఈ జట్టు మిగిలిన ఒక లీగ్ మ్యాచ్ లో గెలిచినా ప్లే ఆఫ్ కు వెళ్లే అవకాశాలు లేనట్టే. ఎందుకంటే మైనస్ నెట్ రన్ రేటు తో ఈ జట్టు కిందకు వెళ్లిపోయింది. 

మంగళవారం ముంబై జట్టుపై భారీ తేడాతో గెలిచి ఉంటే నెట్ రన్ రేటు మెరుగుపరుచుకుని కొంచెం మెరుగైన స్థానానికి వెళ్లి ఉండేది. కానీ, అది సాధ్యపడలేదు. ముంబై ప్లేయర్ టిమ్ డేవిడ్ బ్యాటుతో విధ్వంసం సృష్టించాడు. 18 బంతుల్లో 46 పరుగులు రాబట్టాడు. దీంతో సన్ రైజర్స్ ఆధిపత్యం గణనీయంగా తగ్గిపోయింది. టిమ్ డేవిడ్ రన్ అవుట్ కాకపోయి ఉంటే ముంబై మ్యాచ్ తన్నుకుపోయి ఉండేది. 

సన్ రైజర్స్ జట్టు కోచ్ టామ్ మూడీ ఈ విషయంపై మాట్లాడాడు. డేవిడ్ అలా ఆడకపోయి ఉంటే, సన్ రైజర్స్ మంచి ఆధిక్యాన్నే నమోదు చేసి ఉండేదని, నెట్ రన్ రేటు పెరిగి ఉండేదన్నాడు. ‘‘అంతిమంగా విజయాన్ని సాధించడం ముందు కావాలి. అది మా ప్రాధాన్యం. మా వైపు నుంచి తగినంత స్కోరు సాధించాం. నెట్ రన్ రేటు పరంగా మంచి ఫలితాన్ని సాధించి ఉండేవాళ్లం. టిమ్ డేవిడ్ అసాధారణ ఇన్నింగ్స్ చూశారుగా. అద్భుతమైన ఆటతో ముంబైని పోటీలోకి తీసుకొచ్చాడు. దాంతో ఆధిక్యం తగ్గిపోయింది’’ అని టామ్ మూడీ పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News