Mahesh Babu: తన అభిమానుల పట్ల భావోద్వేగంగా స్పందించిన మహేశ్ బాబు

Mahesh Babu says thanks to his fans for making Sarkaru Vaari Paata
  • ఘన విజయం సాధించిన 'సర్కారువారి పాట'
  • ఇప్పటి వరకు రూ. 160 కోట్ల గ్రాస్ సాధించిన వైనం
  • ఈ చిత్రం ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుందన్న మహేశ్ బాబు
సూర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేశ్ కాంబినేషన్లో వచ్చిన 'సర్కారువారి పాట' చిత్రం ఘన విజయం సాధించింది. విడుదలైన తొలి రోజు నుంచే ఈ సినిమా విశ్వరూపం చూపించింది. సూపర్ హిట్ మూవీగా నిలిచింది. కేవలం తెలుగులో మాత్రమే విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ ను కొల్లగొడుతోంది. విడుదలైన ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల షేర్ సాధించింది. ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 160 కోట్ల గ్రాస్ సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది. 

'సర్కారువారి పాట' ఘన విజయం సాధించిన నేపథ్యంలో మహేశ్ బాబు సంతోషాన్ని వ్యక్తం చేశారు. సినిమాను బ్లాక్ బస్టర్ చేసిన తన సూపర్ ఫ్యాన్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నానని చెప్పారు. మీరందరు కురిపిస్తున్న ప్రేమకు పొంగిపోతున్నానని అన్నారు. సినిమా విజయం సాధించడానికి కారణమైన టీమ్ సభ్యులందరికీ థ్యాంక్స్ చెపుతున్నానని ట్వీట్ చేశారు. ఇంత మంచి సినిమాను ఇచ్చిన తన దర్శకుడు పరశురామ్ కు, కీర్తి సురేశ్ కు, నిర్మాతలకు, అద్భుతమైన సంగీతాన్ని అందించిన తమన్ కు థ్యాంక్స్ అని అన్నారు. 'సర్కారువారి పాట' ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుందని చెప్పారు.
Mahesh Babu
Sarkaru Vaari Paata
Tollywood

More Telugu News