'ఏజెంట్' పుకార్లపై స్పందించిన నిర్మాత!

  • 'ఏజెంట్' ప్రాజెక్టు నుంచి సురేందర్ రెడ్డి తప్పుకున్నాడని ప్రచారం 
  • సినిమా షూటింగు ఆగిపోయిందంటూ షికారు చేస్తున్న వార్త
  • అదంతా పుకారేనని తేల్చిన అనిల్ సుంకర 
  • త్వరలో టీజర్ వదలనున్నామంటూ స్పష్టీకరణ 
Agent movie update

అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' సినిమా రూపొందుతోంది. అఖిల్ ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాతో, కథానాయికగా సాక్షి వైద్య పరిచయమవుతోంది.
 
సురేందర్ రెడ్డి  ..  అనిల్ సుంకర మధ్య మనస్పర్థలు తలెత్తడంతో, ఈ ప్రాజెక్టు నుంచి సురేందర్ రెడ్డి తప్పుకున్నాడనే టాక్ రెండు రోజులుగా వినిపిస్తోంది. ఇక ఈ ప్రాజెక్టు ఆగిపోయినట్టేననే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అనిల్ సుంకర స్పందించారు. ఈ సినిమా షూటింగు ఆగిపోలేదనే విషయాన్ని స్పష్టం చేశారు.

ఈ సినిమా తాజా షెడ్యూల్ మనాలీలో మొదలవుతుందని ఆయన చెప్పారు. త్వరలోనే టీజర్ ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నామని అన్నారు. తమ సినిమాకి సంబంధించి ఎలాంటి పుకార్లను నమ్మవద్దనీ, తమ అధికారిక ట్విట్టర్ ను ఫాలో అయితే సరైన సమాచారం తెలుస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.

More Telugu News