Narendra Modi: కేన్స్ చలనచిత్రోత్సవం నేపథ్యంలో ప్రధాని మోదీ సందేశం

  • ప్రారంభమైన కేన్స్ ఫిలిం ఫెస్టివల్
  • మే 17 నుంచి 28 వరకు ప్రపంచ సినిమా సంరంభం
  • భారత్ వద్ద ప్రపంచానికి చాటిచెప్పే కథలున్నాయన్న మోదీ
  • భారత్ ప్రపంచ కంటెంట్ హబ్ అని ఉద్ఘాటన
PM Modi message in the wake of Cannes Film Festival

ప్రపంచ సినీ రంగంలో ఆస్కార్ అవార్డుల తర్వాత కేన్స్ చలనచిత్రోత్సవానికి విశిష్ట గుర్తింపు ఉంది. ప్రతి సినీ దర్శకుడు తమ చిత్రం కేన్స్ వేదికగా ప్రదర్శితమవ్వాలని కోరుకుంటారు. కాగా, 75వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు నేడు తెరలేచింది. ఈ చలనచిత్రోత్సవం మే 17 నుంచి 28వ తేదీ వరకు జరగనుంది. 

ఈ నేపథ్యంలో, భారత ప్రధాని నరేంద్ర మోదీ తన సందేశాన్ని వెలువరించారు. భారత్ వద్ద ప్రపంచానికి చాటిచెప్పే కథలెన్నో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచ కంటెంట్ హబ్ గా మారేందుకు అవసరమైన అపారమైన శక్తిసామర్థ్యాలు భారత్ కు ఉన్నాయని వివరించారు. 
కాగా, ఈసారి కేన్స్ ఫిలిం ఫెస్టివల్ జ్యూరీలో భారత్ ప్రాతినిధ్యం ఉంది. బాలీవుడ్ అందాలభామ దీపిక పదుకొణే కేన్స్ జ్యూరీలో సభ్యురాలిగా నియమితురాలైంది. నేడు కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ప్రారంభమైన సందర్భంగా జ్యూరీ సభ్యులను మీడియాకు పరిచయం చేశారు. దీపిక వినూత్న వస్త్రధారణతో దర్శనమిచ్చింది.
మిల్కీ బ్యూటీ తమన్నా కూడా కేన్స్ లో తళుక్కుమంది. తమన్నాకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

More Telugu News