YSRCP: ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యూవ‌బుల్‌ పవర్ ప్రాజెక్టు ఎవ‌రిదో తెలుసా?

  • వైసీపీ నేత చ‌ల‌మ‌లశెట్టి సునీల్ కుటుంబానిదే గ్రీన్ కో ఎన‌ర్జీ
  • కాకినాడ ఎంపీ స్థానం నుంచి మూడు సార్లు పోటీ చేసిన సునీల్‌
  • పీఆర్పీ, టీడీపీ, వైసీపీ టికెట్ల‌పై పోటీ చేసి ఓట‌మిపాలైన నేత‌
Greenko Mega Project belongs to ysrcp leader chalamalasetty sunil

ఏపీలోని క‌ర్నూలు జిల్లా ప‌రిధిలోని ఓర్వ‌క‌ల్లు మండ‌లం గుమ్మితం తండాలో మంగ‌ళ‌వారం సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యూవ‌బుల్ ప‌వర్ ప్రాజెక్టును ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. రూ.15 వేల కోట్ల పెట్టుబ‌డితో ఐదేళ్లలో నిర్మాణం పూర్తి చేసుకోనున్న ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్న కంపెనీ గ్రీన్ కో ఎన‌ర్జీ అన్న సంగ‌తీ తెలిసిందే. 

ఈ కంపెనీ ఎవ‌రిద‌న్న విష‌యంపై ఇప్పుడు ఆస‌క్తి నెల‌కొంది. ఈ కంపెనీ వేరెవ‌ర‌దితో కాదు, మ‌న తెలుగు నేల‌కు చెందిన పారిశ్రామిక‌వేత్త‌ల ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న కంపెనీనే. వైసీపీ నేతగా కొనసాగుతున్న చలమలశెట్టి సునీల్ సోద‌రుడు చ‌ల‌మ‌ల‌శెట్టి అనిల్ కుమార్ ఈ కంపెనీకి సీఈఓగానే కాకుండా ఎండీగానూ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తెలుగు నేల‌కు చెందిన మ‌హేశ్ కొల్లి ఈ కంపెనీకి ప్రెసిడెంట్‌గా కొన‌సాగుతున్నారు. 
పై ఫొటోలో జ‌గ‌న్‌కు కుడివైపున ఉన్న‌ది అనిల్ కుమార్ సోద‌రుడు చ‌ల‌మ‌ల‌శెట్టి సునీల్. కాకినాడ లోక్ స‌భ స్థానం నుంచి ఈయ‌న ఇప్ప‌టిదాకా మూడు సార్లు పోటీ చేశారు. 2009లో పీఆర్పీ త‌ర‌ఫున పోటీ చేసిన సునీల్ టీడీపీ అభ్య‌ర్థి కంటే అధిక ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. ఇక 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున అదే స్థానం నుంచి పోటీ చేసి కేవ‌లం 3,431 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2019 ఎన్నిక‌ల‌కొచ్చేస‌రికి వైసీపీని వీడి టీడీపీలో చేరిన ఆయ‌న అదే స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి వైసీపీ అభ్య‌ర్థి వంగా గీత చేతిలో 25 వేల ఓట్ల తేడాతో ఓట‌మిపాల‌య్యారు. ఎన్నిక‌లు ముగిశాక‌... 2020లో టీడీపీని వీడిన సునీల్ తిరిగి వైసీపీలో చేరిపోయారు.

  • Loading...

More Telugu News