ప్రభాస్ 'స్పిరిట్' విషయంలో క్లారిటీ ఇచ్చిన కియారా!

17-05-2022 Tue 18:28
  • 'భరత్ అనే నేను' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన కియారా
  • ప్రస్తుతం చరణ్ - శంకర్  సినిమా షూటింగులో బిజీ
  • 'స్పిరిట్'లో ప్రభాస్ జోడీగా ఎంపికైందంటూ టాక్ 
  • అందులో నిజం లేదని తేల్చి చెప్పిన అధికార ప్రతినిధి    
Spirit movie update
తెలుగు తెరకి 'భరత్ అనే నేను' సినిమాతో కియారా అద్వాని పరిచయమైంది. ఆ సినిమాతో హిట్ అందుకున్న ఆమె ఆ తరువాత 'వినయ విధేయ రామ' సినిమాతో ఫ్లాప్ ను చూడవలసి వచ్చింది. ప్రస్తుతం ఆమె చరణ్ - శంకర్ కాంబినేషన్లో ఒక సినిమా చేస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే వేసవిలో విడుదల కానుంది. 

ఈ నేపథ్యంలో ప్రభాస్ సినిమా కోసం ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా కియారాను తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ మీడియాలోను ఇదే వార్త హల్ చల్ చేస్తోంది. 

ఈ నేపథ్యంలో కియారా తరఫు అధికార ప్రతినిధి స్పందించారు. 'స్పిరిట్' సినిమా కోసం తమని ఎవరూ ఇంతవరకూ సంప్రదించలేదని ఆయన స్పష్టం చేశారు. అందువలన ఈ సినిమాలో కియారా చేస్తుందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని చెప్పారు. ఆమె చేసే కొత్త ప్రాజెక్టుల వివరాలను అధికారికంగా తెలియజేస్తామని అన్నారు.