Sekhar Movie: అమెరికాలో రాజ'శేఖర్' ప్రీమియర్స్.. యూఎస్ లో ఏయే సిటీలో ఏయే థియేటర్లో అంటే..!

List of theatres of USA where Sekhar movie premieres will be shown
  • ఈ నెల 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న 'శేఖర్'
  • అమెరికాలో 19న పడనున్న ప్రీమియర్స్
  • ఇప్పటికే ఈ సినిమాపై నెలకొన్న భారీ అంచనాలు
రాజశేఖర్ హీరోగా నటించిన 'శేఖర్' ఈ నెల 20వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. మరోవైపు ఈ విడుదలకు ఒకరోజు ముందు... అంటే మే 19న అమెరికాలో ప్రీమియర్స్ పడనున్నాయి. రాజశేఖర్ కెరీర్లోనే ఎన్నడూ లేనంతగా పెద్ద సంఖ్యలో అమెరికాలో థియేటర్లలో ప్రీమియర్స్ కు సర్వం సిద్ధమయింది. 

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'జోసెఫ్' చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో రాజశేఖర్ గెటప్ హైలైట్ గా నిలిచింది. 'గరుడవేగ' తర్వాత రాజశేఖర్ మరో ఘన విజయాన్ని అందుకోబోతున్నారనే అంచనాలు ఇప్పటికే నెలకొన్నాయి. ఈ చిత్రంలో రాజశేఖర్ కుమార్తె శివాని ప్రధాన పాత్ర పోషించింది.

అమెరికాలో ప్రీమియర్స్ పడనున్న థియేటర్లు ఇవే: 


ఈ చిత్రానికి జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు. వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో టారస్ సినీ కార్ప్, పెగాసన్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపుర క్రియేషన్స్ పతాకాలపై శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, బీరం సుధాకర్ రెడ్డి, వెంకట శ్రీనివాస్ బొగ్గారం ఈ చిత్రాన్ని నిర్మించారు.
Sekhar Movie
Rajasekhar
Jeevitha Rajasekhar
Tollywood
Release Date
USA
Premieres

More Telugu News