US: ఆరు నెలల్లో అన్ని గ్రీన్ కార్డు దరఖాస్తుల ప్రాసెసింగ్.. అమెరికా ప్రెసిడెన్షియల్ ప్యానెల్ సిఫార్సు

US commission votes to process all green card applications within 6 months
  • ప్రతిపాదనకు అనుకూలంగా అడ్వైజరీ కమిటీ ఏకగ్రీవ నిర్ణయం
  • అధ్యక్షుడు జోబైడెన్ కు సిఫారసు చేయనున్న కమిటీ
  • ఆమోదం  లభిస్తే భారతీయ అమెరికన్ల నిరీక్షణకు తెర
గ్రీన్ కార్డు దరఖాస్తుదారుల కష్టాలకు తెరపడనుంది. అన్ని దరఖాస్తులను ఆరు నెలల్లోగా ప్రాసెస్ చేసే ప్రతిపాదనకు అనుకూలంగా అమెరికా అధ్యక్షుడికి సంబంధించిన అడ్వైజరీ కమిషన్ (ప్రెసిడెన్షియల్ అడ్వైజరీ కమిషన్) ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు సిఫారసు చేయనుంది. 

ఇది వేలాది మంది భారతీయ అమెరికన్లకు తీపి కబురు వంటిదే. ఈ సిఫారసుకు అధ్యక్షుడి ఆమోదం లభిస్తే.. అమెరికాలో శాశ్వత నివాస హోదాను కల్పించే గ్రీన్ కార్డు కోసం దశాబ్దాలుగా వేచి చూస్తున్న భారతీయ అమెరికన్లకు మోక్షం లభించినట్టే అవుతుంది. గ్రీన్ కార్డును శాశ్వత నివాస గుర్తింపు కార్డుగా చూస్తారు. ఇది ఉంటే అమెరికాలో చట్టబద్ధమైన శాశ్వత నివాస హోదా లభించినట్టే. 

భారత్ నుంచి అమెరికాలో అడుగుపెట్టే ఐటీ ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఎంతో నైపుణ్యాలున్నవారే. వీరంతా హెచ్1బీ వీసాపై వస్తారు. వీరు గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే అందరికీ వస్తుందన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే ప్రతీ దేశానికి ఏడు శాతం కోటా పరిమితి విధించారు. దీంతో చాలా మంది భారతీయులు గ్రీన్ కార్డు కోసం చాన్నాళ్లుగా వేచి చూస్తున్నారు. భారీగా పేరుకుపోయిన ధరఖాస్తుల విధానాన్ని సంస్కరించేందుకు వీలుగా అడ్వైజరీ కమిటీ ఆరు నెలల కాల పరిమితికి అనుకూలంగా సిఫారసు చేయాలని నిర్ణయించింది.
US
green card
applications

More Telugu News