Kagiso Rabada: ఐపీఎల్ లో రబాడాకు అరుదైన రికార్డు

Kagiso Rabada surpasses Dale Steyn to become the leading wicket taker from South Africa in the IPL
  • ఐపీఎల్ లో 98 వికెట్ల మైలురాయికి చేరిక
  • దక్షిణాఫ్రికా బౌలర్లలో అత్యధిక వికెట్లు అతడివే
  • రెండో స్థానానికి దిగిపోయిన డేల్ స్టెన్
దక్షిణాఫ్రికా బౌలర్ కగిసో రబాడ ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన దక్షిణాఫ్రికా బౌలర్ గా ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య సోమవారం మ్యాచ్ లో ఈ రికార్డు నమోదైంది. 98 వికెట్లతో రబాడా దక్షిణాఫ్రికా బౌలర్లలో మొదటి స్థానానికి చేరాడు. 

97 వికెట్లతో ఇప్పటి వరకు మొదటి స్థానంలో ఉన్న డేల్ స్టిన్ ను వెనక్కి నెట్టేశాడు. మిశ్చెల్ మార్ష్ వికెట్ తీయడంతో ఈ ఘనత సొంతమైంది. నిన్నటి మ్యాచ్ లో రబాడాకు ఈ ఒక్క వికెట్టే దక్కింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఓటమి పాలై ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపు చేజార్చుకుందని చెప్పుకోవాలి. పంజాబ్ కింగ్స్ కేవలం ఆరు విజయాలతో కింది నుంచి నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో విజయంతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ కు దగ్గరైంది.
Kagiso Rabada
Dale Steyn
wicket taker
IPL
record

More Telugu News