RP Patnaik: ఆ పాట కోసం దశరథ్ నన్ను వాష్ రూమ్ లో బంధించాడు: ఆర్పీ పట్నాయక్

  • 'సంతోషం' పాటల గురించి ప్రస్తావించిన ఆర్పీ 
  • ముందుగా చేసిన పాటను రాజు సుందరం చేయనన్నారని వెల్లడి  
  • షూటింగ్ ఆగిపోవడంతో దశరథ్ టెన్షన్ పడ్డాడన్న ఆర్పీ    
  • అప్పటికప్పుడు పల్లవి చెప్పానని వెల్లడి 
RP Patnaik Interview

సంగీత దర్శకుడిగా .. గాయకుడిగా ఆర్పీ పట్నాయక్ కి మంచి పేరు ఉంది. ఆయన సంగీతాన్ని సమకూర్చిన  సినిమాల్లో 'సంతోషం' ఒకటి. ఆ సినిమాలో  'దేవుడే దిగి వచ్చినా .. '  పాట సూపర్ హిట్. ఆ పాటను గురించి తాజా ఇంటర్వ్యూలో ఆర్పీ మాట్లాడుతూ .. "ఈ పాటకి ముందు నేను 'గలగలా గోదారిలా' అనే పాట ఇచ్చాను. ఆ పాటకి అసలు ఏం కంపోజ్ చేయాలో అర్థం కావడం లేదంటూ రాజు సుందరం గారు షూటింగ్ ఆపేశారు. 

దాంతో  దశరథ్ నన్ను పిలిపించాడు .. నేను లొకేషన్ కి వెళ్లాను. లిరిక్ మారిస్తేనే రాజు సుందరం చేస్తానని అంటున్నారని నాకు చెప్పారు. హీరో .. హీరోయిన్ .. డాన్సర్స్ అంతా వెయిటింగ్. సమయం లేకపోవడంతో నేను చాలా టెన్షన్ పడ్డాను. కులశేఖర్ కి కాల్ చేసి పాట రాయమన్నానుగానీ .. అంత సమయం లేదు. 

నేను వాష్ రూమ్ కి వెళితే దశరథ్ బయట గడియ పెట్టి నన్ను బంధించాడు. పల్లవి చెబితేనే గడియ తీస్తానని అన్నాడు. అప్పుడు నేను 'దేవుడే దిగివచ్చినా' అనే పల్లవి చెప్పాను. 'ఓకే ఇక మిగతా లైన్స్ వచ్చేస్తాయిలే అని అప్పుడు దశరథ్ గడియ తీశాడు" అంటూ ఆ సినిమా షూటింగు సమయంలో జరిగిన సంఘటన గురించి ఆయన చెప్పుకొచ్చారు.

More Telugu News