కాస్టింగ్ కౌచ్ ఎప్పుడు లేదు చెప్పండి? : సీనియర్ నటి

  • ఒకప్పుడు నటిగా బిజీగా ఉన్న రాధాప్రశాంతి
  • ఆ తరువాత తగ్గుతూ వచ్చిన అవకాశాలు 
  • కాస్టింగ్  కౌచ్ ఎప్పుడూ ఉందంటూ వ్యాఖ్య 
  • అందుకే తనకి ఛాన్సులు రావడం లేదంటూ ఆవేదన
Radha Prashanthi Interview

రాధా ప్రశాంతి .. చాలా కాలం క్రితం తెలుగు తెరకి పరిచయమయ్యారు. కొంతకాలం వరకూ ఆమె కెరియర్ బాగానే కొనసాగింది. ఆ తరువాత ఆమెకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఇక ఇప్పుడు ఆమె సినిమాలకు పూర్తి దూరంగా ఉంటున్నారు. కొంతకాలం క్రితం హాట్ టాపిక్ గా మారిన కాస్టింగ్ కౌచ్ గురించిన ప్రశ్న తాజా ఇంటర్వ్యూలో ఆమెకి ఎదురైంది.

అందుకు ఆమె స్పందిస్తూ .. "ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది అప్పుడూ ఉంది .. ఇప్పుడూ ఉంది .. ఇక ముందు కూడా ఉంటుంది. అప్పట్లో ఎవరి తిప్పలు వాళ్లు పడే వారే తప్ప ఈ స్థాయిలో పబ్లిసిటీ చేసుకోలేదు. ఇప్పుడు ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ రోడ్డెక్కారు అంతే. ఇక్కడ ఎవరూ ఎవరినీ బలవంతం చేయరు .. ఎవరి ఇష్టం వారిది.

 కాస్టింగ్ కౌచ్ ఉండటం వల్లనే నాకు అవకాశాలు రావడం లేదు. నన్ను తమ సినిమాల్లోకి పెట్టుకుని కూడా మళ్లీ తీసేసిన సందర్భాలు ఉన్నాయి. ఒకేసారి నన్ను సెకండ్ హీరోయిన్ గా తీసుకుని .. మేనేజర్ తో అడిగించారు. అందుకు ఒప్పుకోకపోతే తీసేశారు. ఓకే అన్నవారిని పెట్టుకున్నారు. అలా నేను బాధపడిన సంఘటనలు చాలానే ఉన్నాయి" అంటూ చెప్పుకొచ్చారు.

More Telugu News