Nara Lokesh: మాజీ సీఎం కొడుకు అయినంత మాత్రాన ఏది ప‌డితే అది అడిగేస్తారా?: నారా లోకేశ్‌పై మంత్రి కాకాణి ఫైర్‌

kakani reaction on nara lokesh letter to ap cm jagan on agriculture
  • సాగుపై జ‌గ‌న్‌కు లోకేశ్ ప్ర‌శ్నాస్త్రాలు
  • లోకేశ్ లేఖ‌పై మంత్రి కాకాణి మండిపాటు
  • రైతు, కౌలు రైతు అంటే లోకేశ్‌కు తెలుసా?
  • లోకేశ్ ఏమైనా హ‌రిత విప్ల‌వ పితామ‌హుడా అన్న కాకాణి
రైతుల‌కు అన్యాయం చేస్తున్నార‌ని ఆరోపిస్తూ ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ సంధించిన ప్ర‌శ్నాస్త్రాల‌పై వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. లోకేశ్ ఏమైనా హ‌రిత విప్ల‌వ పితామ‌హుడా?  లేదంటే వ్య‌వ‌సాయ రంగ నిపుణుడా? అని ఈ సంద‌ర్భంగా కాకాణి ప్ర‌శ్నించారు. మాజీ సీఎం చంద్ర‌బాబు కుమారుడు అయినంత‌మాత్రాన ఏది ప‌డితే అది అడిగేస్తారా? అని కాకాణి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

నారా లోకేశ్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇవ్వ‌డానికి త‌న‌కే ఇబ్బందిగా ఉంద‌ని కూడా కాకాణి వ్యాఖ్యానించారు. అస‌లు లోకేశ్ కు రైతు, కౌలు రైతు అంటే ఏమిటో తెలుసా? అని మంత్రి ప్ర‌శ్నించారు. టీడీపీ, ఎల్లో మీడియా ప‌నిగ‌ట్టుకుని మ‌రీ ప్ర‌భుత్వం బుర‌ద చ‌ల్లేందుకు య‌త్నిస్తున్నాయ‌ని ఆరోపించిన కాకాణి...వాటిని న‌మ్మ‌వ‌ద్ద‌ని రైతుల‌కు సూచించారు.
Nara Lokesh
TDP
Kakani Govardhan Reddy
YSRCP

More Telugu News