Rajasthan: యువతిపై అత్యాచారం అభియోగాలు.. రాజస్థాన్ మంత్రి కుమారుడికి సమన్లు

Rajasthan Ministers Son Not Found Cops Leave Rape Case Notice On Door
  • గతేడాది జనవరి 8 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 17 మధ్య రోహిత్ పలుమార్లు అత్యాచారం చేశాడంటూ యువతి ఫిర్యాదు
  • అరెస్ట్ చేసేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన 15 మంది పోలీసులు
  • రోహిత్ లేకపోవడం, ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండడంతో ఇంటికి సమన్లు
  • 18న విచారణకు రావాలని ఆదేశం
యువతిపై అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత, రాజస్థాన్ మంత్రి మహేష్ జోషి కుమారుడు రోహిత్ జోషికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ నెల 18న విచారణకు హాజరు కావాలని అందులో ఆదేశించారు. వివాహం చేసుకుంటానని నమ్మించి గతేడాది జనవరి 8 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 17 మధ్య రోహిత్ తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని జైపూర్‌కు చెందిన 23 ఏళ్ల యువతి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు, తన కుటుంబానికి రోహిత్, ఆయన తండ్రితో ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని వేడుకుంది. 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ కేసులో అతనిని అరెస్ట్ చేసేందుకు ఢిల్లీ నుంచి 15 మంది పోలీసులు నిన్న ఉదయం జైపూర్ వెళ్లారు. అయితే, రోహిత్ లేకపోవడం, అతని ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉండడంతో ఆయన ఇంటికి సమన్ల కాపీ అతికించారు. ఈ నెల 18న విచారణకు హాజరు కావాలని అందులో ఆదేశించారు.
Rajasthan
Congress
Mahesh Joshi
Rohit Joshi
Delhi Police
Rape Case

More Telugu News