విడాకులు ఇవ్వనున్న సల్మాన్ మరో తమ్ముడు.. ఒక స్టార్ హీరోయినే కారణమట!

  • బాలీవుడ్ లో కామన్ అయిపోయిన విడాకులు
  • విడాకులు తీసుకోవాలనుకుంటున్న సొహైల్, సీమా ఖాన్
  • హ్యుమా ఖురేషీతో సొహైల్ రిలేషన్ షిప్ లో ఉన్నాడని ప్రచారం
Sohail Khan and Seema taking divorce

బాలీవుడ్ లో విడాకులు తీసుకోవడం సర్వసాధారణ విషయంగా మారిపోయింది. వైవాహిక జీవితం పట్ల ఏ మాత్రం విలువ లేనట్టుగా చాలా సింపుల్ గా విడిపోతున్నారు. ఇప్పటికే ఎంతో మంది విడిపోయి, వారివారి కొత్త పార్ట్ నర్స్ తో కలిసి జీవిస్తున్నారు. 

ఇటీవలే బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ పెద్ద తమ్ముడు అర్భాజ్ ఖాన్ తన భార్య మలైకా అరోరాకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఇప్పుడు వేరే వ్యక్తులతో జీవితాన్ని పంచుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా సల్మాన్ చిన్న తమ్ముడు సొహైల్ ఖాన్ కూడా తన భార్య సీమా ఖాన్ నుంచి విడిపోతున్నాడు. 

24 ఏళ్ల క్రితం సొహైల్ ఖాన్, సీమా ఖాన్ లు పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఇద్దరూ విడిపోవాలనుకుంటున్నారని బీటౌన్ లో ప్రచారం జరుగుతోంది. గత కొంత కాలంగా బాలీవుడ్ హీరోయిన్ హ్యూమా ఖురేషీతో సొహైల్ ఖాన్ రిలేషన్ షిల్ లో ఉన్నాడనే ప్రచారం జరుగుతోంది. ఆమె వల్లే సొహైల్, సీమాలు విడిపోతున్నారని చెపుతున్నారు. ఈ విషయంపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.

More Telugu News